గాయపడ్డ తాచుపాముకు ఆపరేషన్

గాయపడ్డ తాచుపాముకు ఆపరేషన్
హర్యానాలో ఓ తాచుపాముకు ఆపరేషన్ చేశారు ITBP వెటర్నరీ డాక్టర్లు. హర్యానాలోని నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ డాగ్స్ సమీపంలో.. గాయపడి ఉన్న ఓ తాచుపామును ITBP సిబ్బంది గుర్తించారు. వెంటనే అక్కడున్న ITBP వెటర్నరీ హాస్పిటల్ కు తరలించారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చి సర్జరీ చేశారు. గాయపడిన భాగంలో కుట్లు వేశారు. 15 రోజుల పాటు పామును అబ్జర్వేషన్ లో పెడతామని.. తర్వాత అడవిలో వదిలిపెడతామని చెప్పారు.