హైదరాబాద్లో భారత్,బంగ్లా టీ20..అక్టోబర్ 5 నుంచే ఆన్లైన్ లో టికెట్లు

హైదరాబాద్ లోని ఉప్పల్ లో  భారత్, బంగ్లా మధ్య  జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ కు రేపటి నుంచే (అక్టోబర్ 5) టికెట్లు విక్రయిస్తున్నట్లు హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు ప్రకటించారు.మూడు టీ20ల్లో భాగంగా  ఉప్పల్ వేదికగా అక్టోబర్  12న  భారత్ - బంగ్లాదేశ్ మూడో టీ20 మ్యాచ్  జరగనుంది.  ఈ మ్యాచ్ టికెట్లు అక్టోబర్ 5  మద్యాహ్నం 12:30 నిమిషాల నుంచి పేటీఎం  ఇన్ సైడర్  వెబ్ సైట్ / ఆప్ లో విక్రయించనున్నారు.  టిక్కెట్ల ప్రారంభ ధర రూ.750, గరిష్ఠ ధర రూ.15 వేలుగా ఉందన్నారు జగన్ మోహన్ రావు.  

Also Read :  కివీస్ కెప్టెన్ మెరుపు హాఫ్ సెంచరీ.. భారత్ ముందు భారీ లక్ష్యం

ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న టికెట్లు  అక్టోబర్ 8 నుంచి 12 తేదీ వరకు సికింద్రాబాద్  జింఖానా స్టేడియంలో  రిడంషన్ చేసుకోవాలి. ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు   ప్రభుత్వ గుర్తింపు గల ఏదైనా ఐడి కార్డు, ఆన్ లైన్ బుకింగ్ ప్రింట్ చూపించి టిక్కెట్లు తీసుకోవచ్చు.  ఆఫ్ లైన్ లో టికెట్లు అమ్మడం లేదని  హెచ్ సిఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తెలిపారు.