ఆన్​ లైన్​ లో ఫుడ్​ఆర్డరిస్తున్నారా.. సలాడ్​ లో కదులుతున్న నత్త..

ఆన్‌లైన్‌‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. తనకు వచ్చిన ఫుడ్ పార్సల్ ఓపెన్ చేయగానే కంగుతిన్నాడు. తనకు వచ్చిన ఫుడ్‌లో ప్రాణంతో ఉన్న నత్త కదులుతూ దర్శనం ఇచ్చింది. దీంతో ఆ కస్టమర్ ఆగ్రహానికి గురయ్యాడు. ఆహారంలో దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు సదరు రెస్టారెంట్‌ను ట్యాగ్ చేస్తూ ఇంకేప్పుడు ఈ రెస్టారెంట్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవద్దంటూ నెటిజన్లకు సూచించాడు.

ప్రముఖ ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు అయిన స్విగ్గీ, జొమాటో( Swiggy, Zomato ) దిమ్మ తిరిగే షాక్ ఇస్తున్నాయి.వీటిలో ఆర్డర్ పెట్టిన ఆహారాల్లో పురుగులు, బల్లులు వస్తున్నాయి.ఆ ఫుడ్ పొరపాటున తిన్నవారు వాంతులు చేసుకుంటూ చాలా సఫర్ అవుతున్నారు.రీసెంట్‌గా తమ ఫుడ్ ఆర్డర్‌లలో అవాంఛిత జీవులను కనుగొన్నారు. 

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్ హల్‌చల్ చేస్తోంది. వివరాలు.. బెంగళూరు చెందిన ధావల్ సింగ్ అనే వ్యక్తి ఇటీవల లియోన్ గ్రిల్(LeonGrill) అనే రెస్టారెంట్ నుంచి స్వీగ్గి ద్వారా సలాడ్ ఆర్డర్ చేసుకున్నాడు. టైంకి ఫుడ్ డైలివరి అయినా.. అతడికి మాత్రం షాకింగ్ అనుభవం ఎదురైంది. ఫుడ్ పార్సల్ ఓపెన్ చేయగానే సింగ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. సలాడ్‌‌లో ప్రాణంతో కదులుతున్న నత్త లాంటి పురుగు కనిపించింది. అది చూసి కంగుతిన్న అతడు అది వీడియో తీశాడు. వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ సదరు రెస్టారెంట్‌ను ట్యాగ్ చేశాడు.

లియోన్ గ్రిల్ (LeonGrill) నుంచి ఇంకేప్పుడు నేను ఫుడ్ ఆర్ట్ చేసుకోవద్దు.. ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఎవరికీ జరగకుండా చూసుకోవడానికి @SwiggyCares ఏమైనా చర్యలు తీసుకుంటుందా?’ అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే అతడి పోస్ట్ స్విగ్గీ స్పందించింది. హాయ్ ధవల్. ఇది నిజంగా భయంకరమైనది. దయచేసి ఆర్డర్ ఐడీ షేర్ చేసి మాకు సహాయం చేయండి. మేము దానిని పరిశీలించి చర్యలు తీసుకుంటాం’ అంటూ ట్వీట్ చేసింది.