ఆన్ లైన్ మనీ యాప్స్ లోన్ ఆగడాలపై హైదరాబాద్ పోలీసులు చెక్ పెట్టారు. ఆన్ లైన్ యాప్స్ ద్వారా డబ్బులు తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో సదరు యాప్ నిర్వాహకులు బాధితులను వేధింపులకు గురి చేస్తున్నారు. వేధింపులు తాళలేక పలువురు ఆత్మహత్య చేసుకోవడంతో పాటు సుమారు 100 బాధితులు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సదరు ఆన్ లైన్ లోన్ మొబైల్ యాప్స్ నిర్వాహకులపై దృష్టి సారించారు. యాప్ నిర్వాహకుల కాల్ డేటా ఆధారంగా హైదరాబాద్ , హర్యానాలలో పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో సుమారు 500పైగా టెలీకాలర్లను అదుపులోకి తీసుకున్నారు. హర్యానాలలో రెండు మొబైల్ కంపెనీ యాప్స్ సంస్థలపై చేసిన దాడిచేయడం భారీ ఎత్తున మైక్రోఫైనాన్స్ దందా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం హర్యానాలో ఉన్న నిందితుల్ని హైదరాబాద్ కు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు.
