గ్యాంబ్లింగ్ అనుకుని ఆన్‌లైన్ గేమ్స్ రద్దు చేస్తున్రు

గ్యాంబ్లింగ్ అనుకుని ఆన్‌లైన్ గేమ్స్ రద్దు చేస్తున్రు
రెగ్యులేటరీ ఫ్రేమ్‌‌వర్క్ తేవాలంటోన్న కంపెనీలు 2022లో రూ.18,700 కోట్లకు ఆన్‌‌లైన్ గేమింగ్ న్యూఢిల్లీ :కరోనా మహమ్మారి ఇండియాలో ఆన్‌‌లైన్ గేమింగ్ ఇండస్ట్రీకి ఒక ఊపు తెచ్చింది. లాక్‌‌డౌన్‌‌తో చాలా మంది ఇంటికే పరిమితమవ్వడంతో ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ కోసం ఆన్‌‌లైన్ గేమ్స్ ఆడారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఈవై అంచనాల ప్రకారం ఆన్‌‌లైన్ గేమింగ్‌‌ ఇండస్ట్రీ 2019లో 40 శాతం పెరిగి రూ.6,500 కోట్ల రెవెన్యూలను పొందిందని వెల్లడైంది. ఈ సెక్టార్ 2022 నాటికి రూ.18,700 కోట్లకు పెరుగుతుందని, వార్షికంగా 43 శాతం గ్రోత్‌‌ను సాధిస్తుందని అంచనావేసింది. అయితే ఇటీవల కాలంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు ఆన్‌‌లైన్ గేమింగ్ ఇండస్ట్రీ గ్రోత్‌‌కి అడ్డంకిగా నిలుస్తున్నాయి. ఆన్‌‌లైన్ గేమింగ్‌‌ను గ్యాంబ్లింగ్ అనుకొని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏకంగా ఆన్‌‌లైన్ గేమ్స్‌‌నే బ్యాన్ చేస్తున్నాయి. తెలంగాణ, ఏపీ, తమిళనాడు ప్రభుత్వాలు ఆన్‌‌లైన్ గేమింగ్ యాక్టివిటీస్‌‌ను బ్యాన్ చేశాయి. అలాగే కర్నాటక కూడా ఆన్‌‌లైన్ గేమింగ్‌‌ను బ్యాన్ చేయాలని చూస్తోంది. అస్సాం, ఒడిశా రాష్ట్రాలు కూడా ఇప్పటికే ఈ యాక్టివిటీని బంద్ చేశాయి. ఆన్‌‌లైన్ గేమింగ్ గ్యాంబ్లింగ్‌‌కు దగ్గరగా ఉందని పలు రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఫ్యామిలీలు తమ ఆదాయాలను కోల్పోతున్నాయని కర్నాటక హోం మంత్రి బసవరాజ్ బొమ్మాని అన్నారు. అయితే ఈ ఇష్యూ అంతా ఆన్‌‌లైన్ గేమింగ్‌‌కు, గ్యాంబ్లింగ్‌‌కు తేడా తెలియకపోవడం వల్లనే వస్తుందని ఇండస్ట్రీ ఎక్స్‌‌పర్ట్‌‌లు అంటున్నారు. గేమ్స్ స్కిల్స్‌‌కు చెందినవి ఉంటాయని చెబుతున్నారు. అన్ని గేమింగ్ యాక్టివిటీలను ఒకే దాని కిందకు తీసుకురావొద్దని పేర్కొంటున్నారు. బ్యాన్ చేయడాని కంటే బదులు ఆన్‌‌లైన్ గేమింగ్ లో ప్రభుత్వాలు మరింత ఇన్‌‌వాల్వ్ అయి వాటి గురించి తెలుసుకోవాలని అంటున్నారు. గేమ్స్ స్కిల్స్‌‌కు చెందినవి, గేమ్స్‌‌ ఛాన్స్‌‌లకు సంబంధించినవి ఉంటాయని ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తి అన్నారు. గ్యాంబ్లింగ్ ఏమిటి? గ్యాంబ్లింగ్ కానిది ఏమిటి? అనే విషయంలో కన్‌‌ఫ్యూజన్ వీడి రద్దుపై నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెస్ డాట్ కామ్‌‌తో పాటు అన్ని రకాల గేమ్స్‌‌ను రద్దు చేసినట్టు గుర్తు చేశారు. ఒకవేళ ఎవరైనా యంగ్ చెస్ ప్లేయర్ ఈ సైట్‌‌లో చెస్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే.. అది కూడా గ్యాంబ్లింగ్ కిందకు వస్తుందా..? అదెలా గ్యాంబ్లింగ్ అవుతుంది? అని ఇండస్ట్రీ ఎక్స్‌‌పర్ట్‌‌లు ప్రశ్నిస్తున్నారు.  స్కిల్స్, ఛాన్స్, ఈస్పోర్ట్స్, ఫ్యాంటసీ కేటగిరీల కింద గేమ్స్‌‌ను గుర్తించాలని గేమింగ్ ఇండస్ట్రీ ఎక్స్‌‌పర్టులు కోరుతున్నారు. గ్యాంబ్లింగ్ గేమ్స్ ఏమిటి? నాన్ గ్యాంబ్లింగ్ గేమ్స్ ఏమిటి? అన్నది తెలుసుకోవాలని పేర్కొన్నారు. ‘గేమింగ్ గ్యాంబ్లింగ్ కాదు. అలాగే ప్రొఫెషనల్ స్పోర్ట్ కూడా గ్యాంబ్లింగ్ కాదు’ అని లాఎన్‌‌కే ప్రిన్సిపల్ లాయర్ నందన్ కామత్ అన్నారు. అయితే ఆన్‌‌లైన్ గేమింగ్‌‌కు, ఆన్‌‌లైన్ గ్యాంబ్లింగ్‌‌కు మధ్య తేడా తెలియక ఇండస్ట్రీ నలిగిపోతుందని పేర్కొన్నారు. ఎకానమీకి సాయం చేస్తాం… ఎకానమీకి తమ వంతు సహకారం అందించేందుకు ఆన్‌‌లైన్ గేమింగ్ కంపెనీలు తమకు సరియైన నిబంధనలు అవసరమని చెబుతున్నట్టు మొబైల్ ప్రీమియర్ లీగ్ లీగల్, పాలసీ వైస్‌‌ ప్రెసిడెంట్ దివ్యజ్యోతి మైనాక్ చెప్పారు. ఇప్పుడే ఎదుగుతోన్న ఈ రంగానికి కూడా రెగ్యులేటెడ్ పాలసీ అవసరమని అన్నారు. ఈ పాలసీ గేమింగ్ రంగంలో స్థిరమైన గ్రోత్‌‌కు, ఇన్వెస్ట్‌‌మెంట్ల ఆకర్షణకు మార్గం చూపించాలని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రాలకు రెవెన్యూ పెరిగి, ఎంప్లాయీమెంట్ జనరేట్ అవుతుందని చెప్పారు.  నీతి ఆయోగ్ ప్రతిపాదనలపై మాట్లాడిన మైనాక్ ప్రభుత్వం నుంచి ప్రోత్సహాకరమైన వాతావరణం ఉందన్నారు. మన దేశీయ కంపెనీలు ఇండియాను ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాంటసీ స్పోర్ట్స్ ఇండస్ట్రీగా నిలబెట్టాయని డ్రీమ్‌‌11 కోఫౌండర్, సీఈవో హర్ష్ జైన్ అన్నారు. నీతి ఆయోగ్ సూచనలతో తాము మరింత పెరుగుతామని, ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ భారత్‌‌కు అనుకూలంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఒకే రకం చట్టాలు అవసరం ఆన్‌‌లైన్ గేమింగ్ ఎక్కువగా స్వతహాగా రెగ్యులేట్ అయ్యేదే ఉంది. పలు ఫెడరేషన్లు ఈ డొమైన్లను రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్, రమ్మీ ఫెడరేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ వంటివి వాటి సంబంధిత డొమైన్లను రెగ్యులేట్ చేస్తున్నాయి. కానీ వీటికి ఒక యూనిఫామ్ లీగల్ ఫ్రేమ్‌‌వర్క్ కావాలని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఆన్‌‌లైన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ కోసం నీతి ఆయోగ్ ఈ నెలల మొదట్లో ఒక డ్రాఫ్ట్ గైడ్‌‌లైన్స్‌‌ను విడుదల చేసింది. దీనిలో సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ కేంద్ర ప్రభుత్వం గుర్తించినదై ఉండాలని పేర్కొంది. వాటికి ఒక స్థిరమైన పాలసీ ఉండాలని ప్రతిపాదించింది. మరోవైపు ఆఫ్‌‌షోర్ బెట్టింగ్ కంపెనీలు ఓవర్-ది-టాప్ వీడియో సర్వీసులను వాడుకుంటూ ఆన్‌‌లైన్ గేమింగ్ యూజర్లకు దగ్గరవ్వాలని చూస్తున్నాయి. గేమింగ్ స్టార్టప్ ఇన్వెస్ట్‌‌మెంట్లు ఇయర్ డీల్స్ డీల్ వాల్యు                      (మి.డాలర్లలో) 2016       15        12.7 2017         5        0.86 2018         9        7.66 2019       12      73.43 2020         5      12.06 (జూన్ వరకు) ఆన్‌‌లైన్ గేమింగ్‌‌ను రద్దు చేసిన రాష్ట్రాలు అస్సాం, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు