- కరోనా టైంలో మనోబలాన్ని పెంచుతాయ: గురు దుష్యంత్ శ్రీధర్
చెన్నై: భారతీయ ఆధాత్మిక సంపద, వేద విజ్ఞానం, పురాణాల గురించి ప్రముఖ స్పిరిచువల్ స్పీకర్ గురు దుష్యంత్ శ్రీధర్ ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది ఆయన అభినవ ఈ-పాఠశాల పేరుతో ఆధ్యాత్మిక కోర్సులను ప్రారంభించారు. పలు అంశాలపై వీడియో, ఆడియో రూపంలో కోర్సులను అందుబాటులోకి తెచ్చారు. కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది మానసికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో ఇలాంటి కోర్సులు మనోబలాన్ని పెంచుతాయని శ్రీధర్ అంటున్నారు. కొత్తగా ఇంగ్లీష్ లో ప్రారంభించిన ‘శ్రీవిష్ణుసహస్రనామ దీపిక’ కోర్సులో మహావిష్ణువుకు ఉన్న అన్ని పేర్లను లోతుగా వివరిస్తున్నారు. ఇప్పటికే నిర్వహిస్తున్న కోర్సుల్లో ‘ప్రబంధ సార బోధిని’లో ఆళ్వారుల జీవితవిశేషాలు, వారు రాసిన తమిళ ప్రబంధాల్లో ముఖ్యమైన అంశాలకు వివరణలు, వ్యాఖ్యానాలు, ఆళ్వారులు చెప్పిన దివ్యాదేశాలను వివరిస్తున్నారు. ఈ కోర్సును తమిళంలో అందిస్తున్నారు. ‘భారతీయ సార బోధిని’ అనే కోర్సు ద్వారా మొదటిసారిగా వేదవిజ్ఞానాన్ని సమగ్రంగా అందిస్తున్నామని దుష్యంత్ శ్రీధర్ చెబుతున్నారు. ఇందులో వేదవేదాంగాలు, న్యాయ-మీమాంస, వేదాంతం, భగవద్గీత, రామాయణ మహాభాతరాలు, పురాణాలతో పాటు ప్రాచీన విజ్ఞానశాస్త్రాలైన ఆయుర్వేదం, అంతరిక్షశాస్త్రం, జ్యోతిష్యం, గణితం, జీవశాస్త్రం, లోహవిజ్ఞానం, చేనేత, మేనేజ్ మెంట్ లాంటివి చెబుతున్నారు. ఇందులోనే సంప్రదాయ ఆర్కిటెక్చర్, సంస్కృత, ప్రాంతీయ భాషల సాహిత్యం, శాస్త్రీయ సంగీతం, డాన్స్, ఆగ్నేయ ఆసియాలో హిందూయిజం ప్రభావం లాంటి అంశాలపైనా అవగాహన కల్పిస్తున్నారు. ఈ కోర్సును ఇంగ్లీష్ లో అందిస్తున్నారు. ఈకోర్సులను ఎవరైనా చేయవచ్చనీ, పూర్తిచేసినవారికి ఈ-సర్టిఫికెట్ అందిస్తామని దుష్యంత్ శ్రీధర్ చెబుతున్నారు. ఈ కోర్సుల్లో చేరడానికి www.desikadaya.org/aep వెబ్ సైట్ కు వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు.
