రాష్ట్రంలో కొనసాగుతున్న డ్రై రన్

రాష్ట్రంలో కొనసాగుతున్న డ్రై రన్
రాష్ట్రంలో డ్రై రన్ కొనసాగుతోంది. హైదరాబాద్ తో పాటు  మహబూబ్ నగర్ లో జిల్లాలో డ్రైరన్ కొనసాగుతోంది.ముఖ్యంగా హైదరాబాద్ లో లో నాలుగు చోట్ల… మహబూబ్ నగర్ లో మూడు ప్రాంతాల్లో డ్రై రన్ టెస్ట్ జరుగుతోంది. 10 వేల మంది వైద్య ఆరోగ్య శాఖ లో పనిచేసే డాక్టర్లు.. నర్సింగ్ స్టాఫ్ వివిధ హోదాల్లో ఉండే స్టాఫ్ అంతా ట్రైనింగ్ తీసుకున్నారు. గతం లో ఇలాంటి వ్యాక్సిన్ లో ఎలాంటి ప్రాక్టీస్ ఉండేదో అది ఇప్పుడు వారికి ఉపయోగపడే అవకాశం ఉంది. ఒక రోజుకు 10వేల మంది పాల్గొని 10లక్షల మందికి వ్యాక్సిన్ చేయగలిగే కెపాసిటీ తెలంగాణలో ఉంది. డ్రై రన్ పూర్తయ్యాక కేంద్ర ప్రభుత్వం 5లక్షల డోసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది..తర్వాత మళ్ళీ 10 లక్షలు..ఆ తర్వాత కోటి డోసులు ఇవ్వనున్నారు. వ్యాక్సన్ మొదట వైద్య ఆరోగ్య శాఖ లో పనిచేసే వారికి..తర్వాత హోమ్, డిపార్ట్మెంట్,ఎక్స్ పోజర్ వారికి ఇవ్వనున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆ తర్వాత పేదవారికి ఇచ్చే అవకాశం ఉందన్నారు.