రెండేండ్ల కిందట... ఒక వీడియో వైరల్ అయింది. అందులో ఒక పిల్లాడు ‘నాకు ఒక కత్తి ఇవ్వండి. దాంతో పొడుచుకొని చచ్చిపోతాను’ అని ఏడుస్తూ చెప్తాడు. వేధింపుల (బుల్లీయింగ్) కారణంగా అతడు పడ్డ బాధ ఆ వీడియోతో ప్రపంచానికి తెలిసింది. మరుగుజ్జు అయిన అతడు ఇప్పుడు సినిమాల్లో నటిస్తున్నాడు. పేరు క్వాడెన్ బేలెస్. అతనికి అకొన్డ్రాప్లేసియా’ డిజార్డర్ ఉంది. దాంతో మరుగుజ్జు అయ్యాడు. అతడి ఎత్తు చూసి స్కూల్లో పిల్లలు వేధించేవాళ్లు. దాంతో బాధపడిన క్వాడెన్ తల్లి కనిపించగానే గట్టిగా ఏడ్చేశాడు. కొడుకు బాధ అందరికీ తెలియాలని వీడియో తీసి ఆన్లైన్లో పెట్టింది. ‘మరుగుజ్జు అయితేనేం హీరో అవ్వొచ్చు’ అని చెప్పడానికి ఆస్కార్ అవార్డ్ విజేత జార్జ్ మిల్లర్ ‘త్రీ థౌజండ్ ఇయర్స్ లాంగింగ్’లో ఛాన్స్ ఇచ్చాడు. క్వాడ్మన్ యాక్టింగ్ నచ్చడంతో ‘మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరియోస’ సినిమాలో కూడా ఛాన్స్ ఇచ్చాడు జార్జ్ మిల్లర్.
