జమిలీపై పీఛేముడ్.?.. బిల్లులపై వెనక్కి తగ్గిన ఎన్డీయే సర్కార్

జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం లేదని సమాచారం. తాజాగా లోక్ సభ బిజినెస్ జాబితా నుంచి రెండు బిల్లులను తొలగించారు.తొలుత  డిసెంబర్ 16న లోక్ సభ ముందకు బిల్లులు తీసుకరావడానికి కేంద్రం సిద్దమైంది.ఆ మేరకు దిగువసభ బిజినెస్ జాబితాలో కూడా పొందుపరిచారు. కేంద్ర మంత్రి అర్జు నామ్ మేఘ్వాల్ బిల్లు పెడతారని ప్రకటించింది. కానీ రివైజ్డ్ లోక్ సభ బిజినెస్ లో ఈ బిల్లులు కనిపించలేదు. ఈ క్రమంలోనే జమిలి ఎన్నికల బిల్లుపై కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు సమాచారం. 

ALSO READ | వెరీ బోరింగ్ స్పీచ్.. విసుగు తెప్పించారు.. ప్రధాని మోడీ ప్రసంగంపై ప్రియాంక సెటైర్లు

మరోవైపు డిసెంబర్ 20తో పార్లమెంటు సమావేశాలు ముగియనున్నాయి. ఇక, వివిధ శాఖల పద్దులకు పార్లమెంట్ ఆమోదం తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తాజా పరి ణామాలు నేపథ్యంలో.. ఈ శీతాకాల సమావే శాల్లో బిల్లులు పెట్టడంపై సందిగ్ధత నెలకొంది. అయితే, స్పీకర్ అనుమతితో సప్లమెంటరీ బిజినెస్ ఏ క్షణమైనా బిల్లును ప్రవేశపెట్టే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటే స్థానిక సంస్థల ఎన్నికలనూ నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలోని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.

మార్పులు.. సవరణలు

లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికల అమలు కోసం రాజ్యాంగంలో కొత్తగా 82 ఏ ఆర్టికలు చేర్చాల్సి ఉంటుంది. పార్లమెంటు పదవీ కాలంలో మార్పు కోసం.. అధికరణం 83ని, అసెంబ్లీల పదవీ కాలం సవరణకు.. ఆర్టికల్ 172ని, ఎన్నికల నిబంధనల రూపకల్పన కోసం పార్లమెంటుకు అధికారం కల్పించే.. అధికరణం 327ని సవరించాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన రెండు బిల్లులకు డిసెంబర్  12న ఆమోదం తెలిపింది.