ఆదివారం (మార్చి 31) జగన్ .. బస్సు యాత్రకు బ్రేక్

రేపు బస్సు యాత్రకు సీఎం జగన్ విరామం ప్రకటించారు. ఈస్టర్ సందర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా నాలుగు రోజుల క్రితం ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన సీఎం బస్సు యాత్ర.. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది.  ఈస్టర్ నేపథ్యంలో రేపు జగన్ విరామం ప్రకటించగా.. సోమవారం నుండి తిరిగి బస్సు యాత్ర రీస్టార్ట్ కానుంది.  కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఇడుపులపాయ నుండి ప్రారంభమైన ఈ యాత్ర నంద్యాల జిల్లా మీదు నుండి అనంతపురం చేరుకుంది.  

మన గ్రామంలో వ్యవసాయం మారింది, వైద్యం మారింది, స్కూళ్లు మారాయంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.   గతానికి భిన్నంగా అన్నీ మారుతున్నాయి. పేదోళ్ల బతుకులు మారాలంటే జరుగుతున్న ఈ మార్పులు కొనసాగడం చాలా అవసరం. ఈ ఎన్నికల్లో మనం వేసే ఓటు జరుగుతున్న ఈ మార్పుని కొనసాగించడం కోసం వేస్తున్నామని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి అంటూ జగన్ ట్వీట్ చేశారు. కాగా ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ బరిలోకి దిగుతుండగా..  టీడీపీ,జనసేన,బీజేపీ కలిసి పోటీచేస్తున్నాయి.