గోల్డ్ కంటే బిట్ కా యిన్ వైపు చూస్తున్న ఇన్వెస్టర్లు
చిన్న ఇన్వెస్టర్లు దూరంగా ఉండాలని సలహాయిస్తున్న నిపుణులు
బిజినెస్‌డెస్క్, వెలుగు: క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ రికార్డ్ లెవెల్లో పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి 1 న 7,199 డాలర్లు(రూ. 5.30 లక్షలు)గా ఉన్న ఈ డిజిటల్ కరెన్సీ, ఆదివారం నాటికి 28,365 డాలర్ల(రూ. 21 లక్షలు) వద్ద ఆల్‌టైమ్ హైని తాకింది. సోమవారం సెషన్‌లో 26,900 డాలర్ల(సుమారు రూ.20 లక్షలు) వద్ద బిట్‌కాయిన్ ట్రేడవుతోంది. గత13 సెషన్లలోనే 19 వేల డాలర్ల స్థాయి నుంచి రూ. ఏడు లక్షలు పెరిగింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను సుమారుగా జీరో చేసిందని, ఇదే స్థాయిలో మరికొన్నేళ్లు ఉండే అవకాశం ఉందని ఎనలిస్టులు అన్నారు. దీంతో ఇన్వెస్టర్లు ఆల్టర్నేటివ్ అసెట్స్ వైపు చూస్తున్నారని చెబుతున్నారు. బిట్‌కాయిన్ కరెన్సీ చాలా తక్కువగా అందుబాటులో ఉండడంతో మరికొంత కాలానికి సప్లయ్ అయిపోతుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఆ తర్వాత ఈ డిజిటల్ కరెన్సీ పెరగడమే తప్ప, తగ్గదని భావిస్తున్నారు. పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు తమ బిట్‌కాయిన్ పోర్టుఫోలియోను పెంచుకుంటుండగా, రిటైల్ ఇన్వెస్టర్లు కూడా ఈ కరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో ఈ డిజిటల్ కరెన్సీ ర్యాలీ చేస్తోంది. త్వరలో 30 వేల డాలర్ల స్థాయిని బిట్‌కాయిన్ తాకుతుందని క్రిప్టో ఎక్స్చేంజ్ లూనో బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్ విజయ్ అయ్యార్ అభిప్రాయపడ్డారు. ఈ డిజిటల్ కరెన్సీ పడినా అది 10–15 శాతం మాత్రమే ఉంటుందని చెప్పారు.
పెరిగిన ప్రతీ సారి భారీ పతనం..
బిట్‌కాయిన్‌పై మిశ్రమ స్పందనలొస్తున్నాయి. ఈ డిజిటల్ కరెన్సీని నమ్మేవారు డాలర్ పతనానికి హెడ్జ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా దీన్ని చూస్తున్నారు. నమ్మనివారు ఈ డిజిటల్ కరెన్సీ వ్యాలిడిటీనే అనుమానిస్తున్నారు. బిట్‌కాయిన్ హిస్టరీ గమనిస్తే ర్యాలీ చేసిన ప్రతీ సారి ఈ కాయిన్ భారీగా క్రాష్ అవ్వడాన్ని గమనించొచ్చు. 2017 డిసెంబర్‌లో 18 వేల డాలర్లు వద్ద ఉన్న బిట్‌కాయిన్, 2018, డిసెంబర్ నాటికి 3,200 డాలర్లకు పడిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో ఏడు వేల డాలర్ల వద్ద ఉన్న ఈ డిజిటల్ కరెన్సీ, తిరిగి మార్చి నాటికి ఐదు వేల డాలర్ల స్థాయికి పడిపోవడాన్ని గమనించొచ్చు. కాగా, ప్రస్తుతం బిట్‌కాయిన్ నెట్‌వర్క్‌లో 18.1 మిలియన్ బిట్‌కాయిన్లు చలామణిలో ఉన్నాయి. మైనర్లు బిట్‌కాయిన్ ట్రాన్సాక్షన్లు లీగల్‌గా జరుగుతున్నాయో లేదో చెక్ చేయడాన్ని బిట్‌కాయిన్ మైనింగ్ అంటారు. ఇలా చేసినందుకు వీరికి బిట్‌కాయిన్లు దొరుకుతాయి. కానీ మైనింగ్ చేసిన వారందరికీ రివార్డులు రావు. ప్రతి నాలుగేళ్లకు బిట్‌కాయిన్ రివార్డులు సగమైపోతాయి.
బిట్‌కాయిన్‌ల లిమిట్ కేవలం 21 మిలియన్‌లు. ప్రస్తుత మైనింగ్ ట్రెండ్ ప్రకారం చివరి బిట్‌కాయిన్ రిలీజ్ అవ్వడానికి మరో 120 ఏళ్లు పడుతుంది. కాగా, బిట్‌కాయిన్లు తక్కువగా అందుబాటులో ఉండడంతో ఈ కరెన్సీ ధరలు పెరుగుతున్నాయి. దీంతో పాటు రిటైల్ ఇన్వెస్టర్లు, ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ పెరుగుతుండడం కూడా ధరలు పెరగడానికి కారణమే. గోల్డ్ మాదిరే బిట్‌కాయిన్‌ను కూడా హెడ్జ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా ఇన్వెస్టర్లు చూస్తున్నారు. అంతేకాకుండా బిట్‌కాయిన్ల సప్లయ్ తగ్గుతూనే ఉంటుంది కాబట్టి గోల్డ్ కంటే ఈ డిజిటల్ కరెన్సీ వైపు ఇన్వెస్టర్లు ఎక్కువగా చూస్తున్నారు. బిట్‌కాయిన్ ప్రారంభంలో ఉన్న అనుమానాలు ఇప్పుడు దూరమవుతున్నాయని, ఈ డిజిటల్ కరెన్సీని ఇన్వెస్ట్‌మెంట్ అసెట్‌గా చూస్తున్నాయని కాయిన్‌డీసీఎక్స్ ఫౌండర్ సుమిత్ గుప్తా అన్నారు. ఈ డిజిటల్ కరెన్సీని కొనుగోలు చేసేందుకు, అమ్ముకునేందుకు వీలుగా కొన్ని ప్లాట్‌ఫామ్‌లు సర్వీస్‌లను అందిస్తున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్‌లన్నీ 2017 లో వచ్చిన క్రిప్టోవేవ్‌తో పుట్టుకొచ్చినవేనని ఎనలిస్టులు చెబుతున్నారు. బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్ చేయడం చాలా సులభమని, కేవలం రూ. 100 లతోనే ఇన్వెస్ట్‌మెంట్‌ను స్టార్ట్ చేయొచ్చని అంటున్నారు.
ఇన్వెస్టర్లు దూరంగా ఉంటేనే మంచిది..
బిట్‌కాయిన్ ధరలు విపరీతంగా పెరుగు తుండడాన్ని చూసి ఇన్వెస్టర్లు ఆకర్షితులు కావద్దని నిపుణులు సలహాయిస్తున్నారు. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌ను, ఇన్వెస్ట్‌మెంట్ ను చూసే రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ ఇండియాలో లేదు. అందువలన ఇన్వెస్టర్లు క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజిల ద్వారా కొనుగోలు చేసే డిజిటల్ కరెన్సీలకు ఎటువంటి గ్యారెంటీ ఉండదు. కొన్న తర్వాత బిట్‌కాయిన్, ఇతర క్రిప్టోలు ఇన్వెస్టర్ల సొంతమైనట్టేనని చెప్పలేము. అంతేకాకుండా ఎటువంటి క్లియరింగ్, సెటిల్‌మెంట్ సిస్టమ్ ఇండియాలో లేదు. క్రిప్టో కరెన్సీ సెటిల్‌మెంట్స్‌పై ఎక్స్చేంజీలు గ్యారెంటీ ఇవ్వలేవు. దీనికి తోడు బిట్‌కాయి న్ ఎక్కువ ఓలటాలిటీలో ట్రేడవుతుంది. కొన్నిసార్లు ఈ డిజిటల్ కరెన్సీ ఏకంగా 20–50 శాతం పడిపోవచ్చు కూడా. తాజాగా సైబర్ దాడులు పెరుగుతుండడంతో క్రిప్టోకరెన్సీ యూజర్లను సైబర్ క్రిమినల్స్ మోసం చేయొ చ్చు. క్రిప్టోకరెన్సీలలో ఇన్వెస్ట్ చేసేముందు ఇన్వెస్టర్లు ఈ రిస్క్‌లన్నింటినీ గమనించాల ని నిపుణులు సలహాయిస్తున్నారు.
ప్రపంచంలోనే తొలి క్రిప్టో బ్యాంక్ ‘యూనికాస్’
ఫిన్‌టెక్ కంపెనీ కాషా, యునైటెడ్ మల్టి స్టేట్ క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీలు కలిసి క్రిప్టో బ్యాంక్‌ను నెలకొల్పాయి. క్రిప్టో కరెన్సీలో ట్రాన్సాక్షన్స్‌కు ఈ బ్యాంక్ వీలు కల్పిస్తుంది. యునైటెడ్‌కు ఉన్న లైసెన్సులు, బ్రాంచ్‌లు, బ్యాంకింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లు ఇప్పుడు తమకు కూడా అందుబాటులోకి వస్తాయని కాషా తెలిపింది. ఈ క్రిప్టో బ్యాంక్‌కు యూనికాస్ పేరు పెట్టారు. తొలి దశలో ఆన్‌లైన్‌తోపాటు, రాజస్థాన్, గుజరాత్, ఎన్‌సీఆర్‌లోని 14 బ్రాంచ్‌లలో జనవరి 2021 నాటికి క్రిప్టో ట్రాన్సాక్షన్స్‌ను నిర్వహిస్తామని, ఆ తర్వాత దశలో 2022 చివరి నాటికి మొత్తం
100 బ్రాంచ్‌లలోనూ అందుబాటులోకి తెస్తామని కంపెనీ పేర్కొంది. లోకల్ ఇండియన్ మార్కెట్‌కు అవసరమైన క్రిపన్టో ప్రొడక్ట్స్‌ను తీసుకురావడం ఇప్పుడు సాధ్యమవుతుందని యూనికాస్ సీఈఓ దినేష్ కుక్రేజ తెలిపారు. ఇండియాలోని ఇతర బ్యాంకుల తరహాలోనే తమ సేవింగ్స్ అకౌంట్స్‌లో డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌ను కస్టమర్లు నిర్వహించుకోవచ్చని వెల్లడించారు. బ్రాంచ్‌ల ద్వారా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌ను అందుబాటులోకి తేవడం ప్రపంచంలో ఇదే మొదటిసారని పేర్కొన్నారు.
