కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగు చట్టాలు మళ్లీ తీసుకొస్తామని చెప్పారు. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని అగ్రో విజన్ ఎక్స్‌పోలో పాల్గొన్న వ్యవసాయం మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. సాగు చట్టాల్ని మళ్లీ తీసుకొచ్చేందుకు ప్రయత్నస్తున్నట్లు తెలిపారు. కొన్ని మార్పులతో వ్యవసాయ చట్టాల్ని మళ్లీ తీసుకొస్తాం అని అన్నారు. కొందరి కారణంగా చర్చకు కూడా నోచుకోకుండా చట్టాలు వివాదాస్పదం అయ్యాయన్నారు. దీంతో కేంద్రం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అందుకే కొన్ని మార్పులు చేసి మళ్లీ వ్యవసాయ చట్టాలు తీసుకొస్తామన్నారు. ఒక అడుగు ముందుకు వేశామంటే.. మూడు అడుగులు ముందుకు వేస్తామన్నారు. వ్యవసాయ చట్టాల్ని మళ్లీ తెచ్చి తీరుతాం అని స్పష్టం చేశారు. దేశానికి వెన్నెముకైన రైతుల కోసం ప్రధాని మోడీ ఎంతో చేశారని తెలిపారు నరేంద్ర సింగ్ తోమర్ . 70 ఏళ్లలో దేశానికి ఎవరూ చేయలేనంత చేసి చూపించారు అని అన్నారు.
దాదాపు ఏడాదిపాటు సాగిన రైతు ఉద్యమం, రెండు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం ప్రకటించిన కొద్దిరోజులకే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని వార్తల కోసం..
