దేశంలో వినాయకచవితి ఉత్సవాల సందడి ప్రారంభమైంది. వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని పూణె నగరంలో శ్రీమంత్ దగ్దుశేఖ్ హల్వాయి వినాయక ఆలయాలు ఎంతో ప్రాచీనమైనవి. ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు.
ఈ ఏడాది ఇక్కడి వినాయకుడికి భక్తులు బాగా ఖరీదైన బంగారు కిరీటాన్ని సమర్పించారు. ఈ స్వర్ణ కిరీటం ఖరీదు రూ.6 కోట్లు. 5 కిలోల గోల్డ్ తో దీన్ని రూపొందించారు. శ్రీమంత్ దగ్దుశేఖ్ హల్వాయి గణేశ్ ఆలయంలో ఈ బంగారు కిరీటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. స్వర్ణ కాంతులతో ధగధగ మెరుస్తున్న వినాయకుడ్ని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు.
ముఖ్యంగా హల్వాయి గణపతి మందిరంలో మహా భోగ్ పేరిట భారీ ఎత్తున మోదక్‌లు, మిఠాయిలు ప్రసాదంగా నివేదిస్తారు. పర్వదినం సందర్భంగా భక్తులు వినాయకుడిని కొత్త దుస్తులు,నగలతో అలంకరించారు.
