మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ కీలక వాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు బదులుగా శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండేకు బరువెక్కిన హృదయంతో, అయిష్టంగా ముఖ్యమంత్రిగా మద్దతు ఇచ్చామని అన్నారు. పన్వేల్‌లో జరిగిన రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశంలో పాటిల్ ఈ కామెంట్స్ చేశారు. స్థిరమైన ప్రభుత్వం, ప్రజలకు సరైన సందేశాన్ని అందించడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పాటిల్ వెల్లడించారు. అయితే.. ఈ నిర్ణయం పట్ల తాము సంతోషంగా లేమన్నారు.
ఇటీవల కాలంలో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామలు చోటుచేసుకుంటున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూలదోసి శివసేన పార్టీ అసమ్మతి నేతలు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపడతారని అందరూ ఊహించారు. కానీ, చివరి నిమిషంలో ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
