
బుర్ర తక్కువ వాడా అని సహజంగా అంటూ ఉంటారు.. ఇక నుంచి నిజంగానే బుర్ర తక్కువ వాళ్లు కాబోతున్నారు జనం.. మనం తినే తిండి.. వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో.. రోజురోజుకు మనిషి బుర్ర సైజ్ తగ్గిపోతుందంట.. అదేనండీ మెదడు. పుట్టినప్పటి నుంచి చనిపోయే సమయానికి.. 10 శాతం మెదడు సైజు తగ్గిపోతుందని.. ఇదంతా గ్లోబల్ వార్మింగ్ ప్రభావం అని సైంటిస్టులు కొత్తగా తేల్చిపోరేశారు. సో.. ఇక నుంచి బుర్ర తక్కువ వాడా ఎవర్నీ అనకండి.. ఎందుకంటే అందరి బుర్ర సైజ్ తగ్గిపోతూనే ఉంది కాబట్టి.. పూర్తి వివరాల్లో వెళితే..
మానవ అభివృద్ధి అనేది చాలా వరకు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మానవ శరీరానికి 50 వేల సంవత్సరాల నాటి రికార్డు ఉంది. దీన్ని బట్టి చూస్తే మానవ మెదడు ఇప్పటికే 10 శాతం తగ్గిపోయిందని చూపిస్తోంది. కాలిఫోర్నియాకు చెందిన నేచురల్ హిస్టరీ మ్యూజియమ్‌కు చెందిన శాస్త్రవేత్త జెఫ్ మోర్గాన్ స్టిబుల్.. మారుతున్న వాతావరణాన్ని బట్టి మానవులు ఎలా మార్పు చెందుతున్నారన్న దానిపై అధ్యయనం చేశారు.
మనస్సుపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదని ఆయన కనుగొన్నారు. మెదడు కుంచించుకుపోయి చిన్నదవుతున్నప్పటికీ. ఇది మనుషుల ప్రవర్తనపై కూడా ప్రభావం చూపుతోందని చెప్పారు. ఈ అధ్యయనం 298 మంది పురాతన మానవుల శిలాజ మెదడుపై జరిగింది. ఇవి 50 వేల సంవత్సరాల క్రితం నాటివి.
వాతావరణంలో మార్పులే మెదడును తగ్గిస్తున్నాయి..
వాతావరణం వెచ్చగా ఉన్నప్పుడు మెదడు సగటు పరిమాణం తగ్గడం ప్రారంభమవుతుందని మరియు శీతాకాలంలో అది విస్తరిస్తున్నందని ఈ అధ్యయనంలో కనుగొన్నారు. జెఫ్ మోర్గాన్ ప్రకారం, మానవ మనస్సు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కొన్ని మిలియన్ సంవత్సరాలలో అనేక జాతుల జీవుల మెదడు అభివృద్ధి చెందిందని, అయితే మానవుల విషయంలో మాత్రం అది రివర్స్ గా జరుగుతోందని జెఫ్ చెప్పారు. 298 మానవ పుర్రెలతో 373 కొలతలు పరిశీలించిన ఆయన.. అవి దొరికిన భౌగోళిక ప్రదేశం వాతావరణంపై పరిశోధన చేశారు.