కార్తీకమాసం చివరి సోమవారం వంకాయలో ఓంకారం ప్రత్యక్షం

వికారాబాద్  వెలుగు : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గంగారం కాలనీకి చెందిన కొత్తపల్లి మీనాక్షి సోమవారం కూర వండేందుకు వంకాయ కోయగా అందులో ఓంకారం’ కనిపించింది. 

ఆశ్చర్యపోయిన మీనాక్షి తన ఫోన్ లో ఫొటో తీసి అందరికీ షేర్​చేసింది. కార్తీక మాసం చివరి సోమవారం నాడు ఓంకారం కనిపించడంపై సంతోషం వ్యక్తం చేసింది.