నోయిడాలో దారుణం జరిగింది. సెక్టార్ 78లోని మహాగున్ మోడరన్ సొసైటీలో ఒక వృద్ధురాలిని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె మృతి చెందింది. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నోయిడాలోని సెక్టార్ 78లోని మహాగున్ మోడరన్ సొసైటీలో వృద్ధురాలు ఈవినింగ్ వాకింగ్ చేస్తోంది. ఈ సమయంలో అతి వేగంగా వచ్చిన కారు..ఆమెపై నుంచి వెళ్లింది. ఓ గల్లీలో నుంచి వచ్చిన కారు..ఆ వృద్ధురాలిను ఢీకొట్టి..ఆమెపై నుంచి వెళ్లింది. ఈ ఘటనలో వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ చనిపోయింది. వృద్ధురాలిని కారు ఢీకొట్టిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న నోయిడా పొలీసులు..దర్యాప్తు చేస్తున్నారు.
#नोएडा में दर्दनाक हादसा.... कार चालक ने इवनिंग वाक कर रही बुजुर्ग महिला को रौंदा
— PRIYA RANA (@priyarana3101) October 12, 2023
नोएडा के सेक्टर 78 स्थित महागुन मॉडर्न सोसाइटी की घटना, सीसीटीवी में घटना हुई कैद
महिला की इलाज के दौरान मौत, सोसाइटी वॉक कर रही थी महिला
@noidapolice pic.twitter.com/JX97PeqMUy
