పోలీసులూ ఇదేం పని..!

మండలంలోని ఉసిరిక పల్లి బస్టాండ్ వద్ద వారం రోజులుగా ఓ వృద్ధురాలు వర్షానికి తడుస్తూ ఇబ్బందులు పడుతోంది. వ్యవసాయ పనికి వచ్చిన కూలీలు, రైతులు అన్నం పెడితే తిని రోజులు గడుపుతోంది. ఆ వృద్ధురాలి గురించి రోడ్డు మీద పోయే వారు, స్థానిక రైతులు బుధవారం రాత్రి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్పందించిన సీఐ కృష్ణ  ఆమెను అనాథాశ్రమంలో చేర్పించాలని పోలీసులను ఆదేశించారు. గురువారం చండి ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న వృద్ధురాలిని ఆర్టీసీ బస్సులో ఎక్కించి పోలీసులు ఎక్కడైనా దింపమని డ్రైవర్, కండక్టర్లకు​చెప్పి పంపించారు. వారు ఆమెను నర్సాపూర్ చౌరస్తా వద్ద వదిలేశారు. దీంతో ఆ వృద్ధురాలు దిక్కు తోచని స్థితిలో ఇబ్బందులు పడుతూ రోడ్డుపైనే ఉంది.  -‌‌‌‌ శివ్వంపేట, వెలుగు