క్విక్ ​డెలివరీకి ఓలా గుడ్​బై!

క్విక్ ​డెలివరీకి ఓలా గుడ్​బై!

న్యూఢిల్లీ: క్విక్​ డెలివరీ (ఓలా డ్యాష్​)తోపాటు పాతకార్ల బిజినెస్ (ఓలా కార్స్)​లను మూసేస్తున్నామని ఓలా ప్రకటించింది. కరెంటు బండ్లు, మొబిలిటీ బిజినెస్​లపై మరింత ఫోకస్​ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.   క్యాబ్​ బిజినెస్​ చాలా బాగుందని, ఓలా ఈవీల వల్ల ఇండియాలోనే అతిపెద్ద ఈవీ కంపెనీగా ఎదిగామని ప్రకటించింది. ఇప్పటి వరకు 50 కోట్ల మందికి మొబిలిటీ సర్వీసులు అందించామని కంపెనీ స్పోక్స్​పర్సన్​ చెప్పారు. ఓలా కార్స్​ను కిందటి ఏడాది అక్టోబరులోనే ఏర్పాటు చేశారు.   డ్యాష్​ స్లోర్లలో పనిచేసే 2,100 మందిని ఈ ఏడాది ఏప్రిల్​లో తీసేశారు. ఓలా కేఫ్స్​పేరుతో 2015లో మొదలుపెట్టిన ఫుడ్​బిజినెస్​ను కూడా ఏడాది తరువాత తొలగించింది.   ఫుడ్​ఫాండాను కూడా  2019లో  మూసేసింది.