హోంగార్డ్ గోపాల్ కు మెరుగైన చికిత్స

  • ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది..
  • కలెక్టర్ క్రాంతి

సంగారెడ్డి టౌన్, వెలుగు : సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువులో అక్రమ నిర్మాణం కూల్చివేత సమయంలో హోంగార్డ్ గోపాల్ గాయపడిన విషయం తెలిసిందే. హైదరాబాద్​లోని ఏఐజీ హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న గోపాల్ ను బుధవారం కలెక్టర్ క్రాంతి, ఎస్పీ రూపేశ్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి గాయత్రీ దేవితో కలిసి పరామర్శించారు. గోపాల్‌‌కు అందుతున్న చికిత్సపై హాస్పిటల్​చైర్మన్ నాగేశ్వర్ రెడ్డితో చర్చలు జరిపారు. 

అతడికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సూచించారు. వైద్యులు గోపాల్ త్వరగా కోలుకుంటారని, రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గోపాల్‌‌కు జరిగే వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ గోపాల్ ఆరోగ్య విషయమై ఎస్ఐ స్థాయి అధికారిచే పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నామని చెప్పారు.