కొండారెడ్డిపల్లిలో సర్వే షురూ

వంగూర్, వెలుగు: సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో బుధవారం విద్యుత్  శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు సోలార్  విద్యుత్ పై ఇంటింటి సర్వే ప్రారంభించారు. సోలార్  విద్యుత్  పైలట్  ప్రాజెక్టు కింద కొండారెడ్డిపల్లిని ప్రకటించడంతో స్పెషల్  ఆఫీసర్  రమేశ్​ ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నారు. 440 ఇండ్లకు వెళ్లి రేషన్, ఆధార్  కార్డు, బ్యాంక్  అకౌంట్, ఫొటోలు, ఇల్లు స్లాబ్  కొలతలు తీసుకున్నారు.

ఇండ్లల్లో 50 కుటుంబాలు అందుబాటులో లేవని, ఆ ఇండ్ల సర్వే సైతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎంపీడీవో విజయభాస్కర్, విద్యుత్  ఏఈ మేఘనాథ్, విలేజ్​ స్పెషల్  ఆఫీసర్  మణిపాల్ నాయక్, ఏపీవో శివశంకర్, ఏపీఎం చంద్రయ్య, మాజీ ఉప సర్పంచ్  వేమారెడ్డి, వెంకటయ్య యాదవ్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.