ఏటిగడ్డ శాఖాపూర్​లో వైద్య శిబిరం

పెబ్బేరు, వెలుగు: మండలంలోని ఏటిగడ్డ శాఖాపూర్​ గ్రామంలో వ్యాధులు ప్రబలడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం వైద్య శిబిరం నిర్వహించారు. రెండ్రోజులుగా గ్రామస్తులు జ్వరాలతో బాధపడుతూపెబ్బేరు, వనపర్తి జిల్లా కేంద్రంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు.

ఆశ కార్యకర్తలు, ఏఎన్​ఎంలు ఇంటింటికీ తిరిగి వైద్య పరీక్షలు చేశారు. కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని గ్రామంలో దోమలు వ్యాప్తి చెందడంతో వ్యాధుల బారినపడ్డారు. పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. హెల్త్​ అసిస్టెంట్​ తిరుపతయ్య, ట్యాబ్​ టెక్నీషియన్​ వెంకటేశ్, ఏఎన్ఎం దీవెనమ్మ, ఆశ కార్యకర్తలు 
పాల్గొన్నారు.