మైలారం మైనింగ్‌‌‌‌‌‌‌‌ను పరిశీలించిన అధికారులు 

నాగర్​ కర్నూల్, వెలుగు: నల్లమల ఏజెన్సీలోని మైలారం గుట్టపై జరుగుతున్న మైనింగ్‌‌‌‌‌‌‌‌ ప్రాంతాన్ని ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌, మైనింగ్‌‌‌‌‌‌‌‌ అధికారులు బుధవారం పరిశీలించారు. బుధవారం ‘మైలారంలో మైనింగ్‌‌‌‌‌‌‌‌ చిచ్చు’ హెడ్డింగ్‌‌‌‌‌‌‌‌తో పబ్లిష్ అయింది. దీనిపై స్పందించిన సీసీఎఫ్‌‌‌‌‌‌‌‌ డీఎఫ్‌‌‌‌‌‌‌‌వో రోహిత్‌‌‌‌‌‌‌‌, రేంజ్​ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సర్వే చేయాలని ఆదేశించారు.

ఈ మేరకు డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో రేణుక, బీట్​ ఆఫీసర్లు, జిల్లా మైనింగ్​ ఇన్​స్పెక్టర్​ నాగచైతన్య తదితరులు మైలారం గుట్టపై మైనింగ్​ప్రాంతాన్ని, గ్రామాన్నీ పరిశీలించారు. మైనింగ్​ఏరియా హద్దులను పరిశీలించారు. ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌లో పొందుపరిచిన నిబంధనలు పరిశీలించారు. ఫారెస్ట్​ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈశ్వర్​ మాట్లాడుతూ సర్వే రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ను ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు. 

ఎకో సెన్సిటివ్​ జోన్​పరిధిపై సందిగ్ధం 

కాగా పులుల అభయారణ్యం సరిహద్దుల్లో ఎకో సెన్సిటివ్​ జోన్​ఎంత మేరకు ఉండాలనే దానిపై స్పష్టత లేనట్లు తెలుస్తోంది. నాగర్​కర్నూల్, ఏపీలోని కర్నూల్, గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లోని టైగర్​రిజర్వ్​జోన్​నుంచి ఎకో సెన్సిటివ్​జోన్​ ఎంత దూరంలో ఉండాలనే దానిపై నాలుగు జిల్లాలకు చెందిన ఉన్నతాధికారుల కమిటీ నిర్ధారించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ కమిటీని ఏర్పాటు చేయకపోవడంతో ఎకోసెన్సిటివ్​ జోన్​పరిధిని గుర్తించలేదు.

ఈనేపథ్యంలో 2023లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం టైగర్​ రిజర్వ్​ ఏరియా నుంచి 5 కి.మీల నుంచి 10 కి.మీల పరిధి వరకు ఎకో సెన్సిటివ్​ జోన్‌‌‌‌‌‌‌‌గానే పరిగణించాలనే ఆదేశాలు ఉన్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలోని ప్లెయిన్​ ఏరియాలు, ఆవాసాలు ఎకో సెన్సిటివ్​ జోన్​ పరిధిలోకి వస్తున్నా నిబంధనలకు లోబడి ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​ నుంచి అనుమతులు పొందిన తర్వాతే పనులు చేపట్టాలని తెలంగాణ ఫారెస్ట్​ యాక్టు, వైల్డ్​లైఫ్ యాక్ట్‌‌‌‌‌‌‌‌లో స్పష్టంగా ఉంది. ఫారెస్ట్​ పరిధిలో చేపట్టే పనులకు ఆయా శాఖల అనుమతి తీసుకోవాలని ఈ చట్టంలో ఉంది.

ఈ జోన్‌‌‌‌‌‌‌‌ పరిధిలో జరిగే కార్యకలాపాలపై కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇతర ఉన్నతాధికారుల పర్యవేక్షణ తప్పనిసరి. కాగా వివాదస్పదంగా మారిన మైలారం గుట్ట అమ్రాబాద్​ టైగర్​రిజర్వ్​ ఏరియా నుంచి 5 కి.మీల పరిధిలోపలే ఉండటం గమనార్హం.​ మరోవైపు ఆరేండ్ల పోరాటాల తర్వాత మొదటిసారి తమ ఊరికి ఉన్నతాధికారులు వచ్చి సర్వే నిర్వహించారని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మైలారం గుట్ట మైనింగ్‌‌‌‌‌‌‌‌ విషయంలో తాము వెనకడుగు వేసేది లేదని ఎన్జీటీలో తాడో పేడో తేల్చుకుంటామని గ్రామస్తులు పేర్కొంటున్నారు.