పెద్దపల్లి జిల్లాలో కోతల్లేని విద్యుత్ వైపు అడుగులు

  • పెద్దపల్లి జిల్లాలో మొత్తం కనెక్షన్స్​ 2,14,362
  • 74  డీటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కెపాసిటీ పెంపునకు నిర్ణయం 
  • జిల్లాలో కొత్తగా మరో 160  డీటీఆర్​ల  ఏర్పాటు

పెద్దపల్లి, వెలుగు: రానున్న సమ్మర్​లో అంతరాయం లేకుండా విద్యుత్ అందించడానికి ట్రాన్స్ కో డిపార్టుమెంట్ కసరత్తులు చేస్తోంది.  గత వేసవిలో ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు రూపొందిస్తోంది.  ప్రస్తుతం జిల్లాలో మొత్తం కనెక్షన్స్​ 2,14,362  ఉండగా,  అందులో  1,30,002  గృహజ్యోతి  హోల్డర్స్​ ఉన్నారు.  జిల్లాలో మొత్తం 69 సబ్​స్టేషన్స్​ ఉండగా, 17,311 డీటీఆర్​లు ఉన్నాయి.  క్వాలిటీ పవర్​ అందించడానికి జిల్లాలోని  74  డిస్ట్రిబ్యూషన్​ ట్రాన్స్‌‌ ఫార్మర్ల కెపాసిటీ పెంచడంతో పాటు, మరో  160  కొత్త ట్రాన్స్​ఫార్మర్ల ఏర్పాటుకు అధికారులు ప్లాన్​రెడీ చేశారు.  

డిమాండ్​కు అనుగుణంగా

గతంలో విద్యుత్ గరిష్ట డిమాండ్ ఉన్న సమయంలో  డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ (డి.టి.ఆర్) పై లోడ్ భారం ఎంత ఉందో టెస్టర్ రీడింగ్ తీసుకున్నారు. దీనికనుగుణంగా నూతనంగా కొత్త ట్రాన్స్​ఫార్మర్లతో పాటు అవసరమైన ట్రాన్స్​ఫార్మర్ల కెపాసిటీ పెంచుతున్నారు. అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు 33 కేవీ ఇంటర్ లింకింగ్  లైన్ వ్యవస్థ పటిష్ట పరుస్తున్నారు.  ప్రతి ఒక్క 33/11 కేవీ సబ్ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఫీడర్ ద్వారా విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి అవసరమైన పనులు పూర్తి చేస్తున్నారు.  ఓవర్ లోడ్ ఉన్న 33కేవీ, 11 కేవీ ఫీడర్లను గుర్తించి లోడ్ రిలీఫ్ చేసేందుకు బదలాయింపు చేస్తున్నామన్నారు. దీంతో లోడ్ భారం తగ్గి నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుందని అధికారులు చెప్తున్నారు. 

రింగ్​ మెయిన్స్​ వ్యవస్థ పటిష్టం

నిరంతరం విద్యుత్ అందించేందుకు రింగ్ మెయిన్స్ వ్యవస్థను పటిష్టపరుస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 11 కేవీ  ఫీడర్లకు అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఫీడర్ల ద్వారా విద్యుత్ అందించాలని ప్రయత్నిస్తున్నారు.  లోడ్​ పెరుగుతున్నా జిల్లా విద్యుత్ ఆఫీసర్లు మాత్రం వినియోగదారులకు నాణ్యమైన కరెంట్ అందిస్తున్నారు.