అమ్రాబాద్ లో వాటర్​ ట్యాంక్​ కూల్చివేత

అమ్రాబాద్, వెలుగు: మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్  సమీపంలో శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్ ను అధికారులు కూల్చివేశారు. ప్రమాదకరంగా వాటర్  ట్యాంక్  శీర్షికతో వెలుగు దినపత్రికలో వచ్చిన కథనానికి  అధికారులు స్పందించారు.

మంగళవారం రాత్రి వరకు ట్యాంక్​ను కూల్చేందుకు శ్రమించినా సాధ్యం కాలేదు. దీంతో బుధవారం ఉదయం ట్యాంక్ ను కూల్చేశారు. డీఈ హేమలత, ఏఈ సందీప్, సెక్రటరీ మల్లేశ్, గ్రామస్తులు, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.