కొండపోచమ్మ హుండీ  ఆదాయం రూ‌‌.8 లక్షలు

జగదేవపూర్, వెలుగు: సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం  కొండపోచమ్మ  ఆలయ హుండీని అధికారులు  మంగళవారం   లెక్కించారు.  అమ్మవారికి 86 రోజులకు  రూ. 8,04,353   ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో రవి కుమార్, దేవాదాయ శాఖ ఇన్​ స్పెక్టర్ రంగా రావు తెలిపారు.

 కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రజీత రమేశ్, ఆలయ సిబ్బంది  వెంకట్ రెడ్డి, కనకయ్య,  పూజారులు మల్లయ్య, లక్ష్మణ్, కొండయ్య, తిరుపతి, గోవర్దన్,  తదితరులు ఉన్నారు.