ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో 233 మంది చనిపోగా 900మందికిగా పైగా గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోడీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అయితే గత దశాబ్ద కాలంలో జరిగిన రైలు ప్రమాదాలలో ఒడిశా రైలు ప్రమాదం అతిపెద్దదని తెలుస్తోంది.
గత దశాబ్ధ కాలంలో
2012
- మే 22న హంపి ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో, కార్గో రైలు హుబ్లీ-బెంగళూరు హంపి ఎక్స్‌ప్రెస్ ఆంధ్రప్రదేశ్‌కి సమీపంలో ఢీకొన్నాయి. రైలు నాలుగు బోగీలు పట్టాలు తప్పడం వాటిలో ఒకటి మంటలు చెలరేగడం వల్ల దాదాపు 25 మంది మరణించారు 43 మంది గాయపడ్డారు.
2014
- మే 26న ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ ప్రాంతంలో, గోరఖ్‌పూర్ వైపు వెళుతున్న గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్, ఖలీలాబాద్ స్టేషన్‌కు సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో 25 మంది మరణించగా.. 50 మందికి పైగా గాయపడ్డారు.
2016
- నవంబర్ 20న ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్ 19321 కాన్పూర్‌లోని పుఖ్రాయాన్ సమీపంలో పట్టాలు తప్పడంతో దాదాపు 150 మంది ప్రయాణికులు మరణించగా..మరో150 మందికి పైగా గాయపడ్డారు.
2017
- ఆగస్టు 23న ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయా సమీపంలో ఢిల్లీకి వెళ్లే కైఫియత్ ఎక్స్‌ప్రెస్ తొమ్మిది రైలు కోచ్‌లు పట్టాలు తప్పడంతో కనీసం 70 మంది గాయపడ్డారు.
- ఆగస్ట్ 18న పూరీ-హరిద్వార్ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ ముజఫర్‌నగర్‌లో పట్టాలు తప్పడంతో 23 మంది మరణించగా దాదాపు 60 మంది గాయపడ్డారు.
2022
- జనవరి 13న, పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దువార్‌లో బికనీర్-గౌహతి ఎక్స్‌ప్రెస్ కనీసం 12 కోచ్‌లు పట్టాలు తప్పడంతో తొమ్మిది మంది మరణించగా 36 మంది గాయపడ్డారు.
2023
- లేటెస్ట్ గా జూన్ 2న బెంగళూరు -హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలుతో ఒడిశాలో జరిగిన ఘోర ట్రిపుల్ రైలు ప్రమాదంలో233 మరణించాగా 900 మందికి పైగా గాయపడ్డారు.
