రైలు ప్రమాదంపై రంగంలోకి సీబీఐ

రైలు ప్రమాదంపై రంగంలోకి సీబీఐ

బాలాసోర్/భువనేశ్వర్: రైలు ప్రమాద ఘటనపై ఒడిశా పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంతో మరణాలకు కారణం కావడం, జీవితాలను ప్రమాదంలోకి నెట్టడం వంటి అభియోగాలను మోపారు. ‘‘ప్రస్తుతానికి రైల్వే ఉద్యోగుల నేరాన్ని ఇంకా నిర్ధారించలేదు. పూర్తి వివరాలు దర్యాప్తులో బయటపడుతాయి” అని ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. ఇక ఈ కేసు దర్యాప్తును సీబీఐ టేకోవర్ చేయనుంది. ప్రమాద స్థలి వద్దకు మంగళవారం సీబీఐ దర్యాప్తు బృందం చేరుకుంటుందని, రైల్వే పోలీసుల నుంచి కేసును టేకోవర్ చేసుకుంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దర్యాప్తు విషయంలో రైల్వే సేఫ్టీ కమిషనర్ సాయాన్ని సీబీఐ కోరే అవకాశం ఉందని చెప్పాయి.