ఒడిశా సీఎం మద్దతు కోరిన ద్రౌపది ముర్ము 

ఒడిశా సీఎం మద్దతు కోరిన ద్రౌపది ముర్ము 

రాష్ట్రపతి  ఎన్నికల్లో మద్దతు  కూడగట్టేందుకు  అన్ని పార్టీల  అధినేతలతో  ఎన్డీఏ  అభ్యర్థి ముర్ము సమావేశమవుతున్నారు.  ఇవాళ సొంత   రాష్ట్రం ఒడిశాకు   వచ్చిన ఆమె.. నవీన్ పట్నానాయక్ తో  భేటీ అయ్యారు. అసెంబ్లీ  హాల్ లో ఏర్పాటు  చేసిన సమావేశానికి  బీజేడీ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు.  ద్రౌపది ముర్మును  నవీన్ పట్నానాయక్   సత్కరించారు. ఇప్పటికే ముర్ముకు మద్దతు ప్రకటించిన బీజేడీ,  మిగతా సభ్యుల  మద్దతు  కూడగట్టేందుకు  ప్రయత్నిస్తున్నారు. ఒడిశా అసెంబ్లీలో  ప్రస్తుతం బీజేడీకి  112 మంది  సభ్యుల బలం  ఉంది. బీజేపీకి 22 మంది సభ్యులు  ఉన్నారు. ఇక ఒకరు   స్వతంత్రులు కాగా.. మరొకరు   వాపక్షాలకు చెందిన వ్యక్తి ఉన్నారు. తర్వాత   బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో  ప్రత్యేకంగా సమావేశమైన  ముర్ము.. అక్కడ నుంచి యూపీకి బయల్దేరారు.