జోరుగా రికార్డింగ్ డ్యాన్సులు.. అరెస్ట్ చేసిన పోలీసులు

జోరుగా రికార్డింగ్ డ్యాన్సులు.. అరెస్ట్ చేసిన పోలీసులు
కర్నూలు: సంక్రాంతి పండుగ.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లోని రైతులు చేసుకునే పెద్ద పండుగ. పంట కోతలు ముగిశాక అట విడుపు సమయంలో వచ్చే సంక్రాంతి అంటే రైతులకు ముఖ్యంగా గ్రామాల్లోని ప్రజలకు ఎనలేని సంతోషం. పంటలు చేతికొచ్చిన సమయంలో ఊరూరా రైతులు సంబరంగా జరపుకుంటారు. కొన్ని చోట్ల పెద్ద ఎత్తున జాతరలు జరుగుతాయి. ఈ సందర్భంగా గ్రామాల్లో అనేక నాటకాలు, ఆటలు, కోళ్ల పందేలు, ఎద్దుల విన్యాసాల పోటీలు జరుగుతుంటాయి. కోళ్ల పందేలతోపాటు, రికార్డింగ్ డ్యాన్సులను ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. అయితే చాలా చోట్ల ఆర్కెస్ట్రా.. లేదా సాంఘిక, పౌరాణిక నాటకాల పేరుతో అనుమతులు తీసుకుని డ్యాన్స్ ప్రోగ్రాములు కూడా నిర్వహిస్తుంటారు. అయితే కొన్ని గ్రామాల్లో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, రాజమండ్రి, గుంటూరు ప్రాంతాల నుండి అమ్మాయిలను తీసుకునివచ్చి మరీ గుట్టు చప్పుడు కాకుండా రికార్డింగ్ డ్యాన్సులు చేయిస్తుంటారు. ఇదే కోవలో సంక్రాంతి పండుగ, జాతరల సందర్భంగా పలు ప్రాంతాల్లో రికార్డింగ్ డ్యాన్సులు జోరుగా జరిగినట్లు సమాచారం. అయితే చాలా చోట్ల సెల్ ఫోన్లలో రికార్డు చేసుకుని షేర్ చేసుకుంటుండం పోలీసుల వరకు వెళుతోంది. ఇదే కోవలో ఆత్మకూరు, పాణ్యం తదితర ప్రాంతాల్లో జోరుగా రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించిన వ్యవహారం పోలీసుల దృష్టికి వెళ్లింది. పలువురు ఫిర్యాదులు కూడా చేయడంతో పోలీసులు రికార్డింగ్ డ్యాన్స్ టీమ్ లను అరెస్టు చేసే పనిలో పడ్డారు. కౌలూరు గ్రామంలోని గుడి వద్ద నిబంధనలకు విరుద్ధంగా డ్యాన్స్ బేబి డ్యాన్స్ పేరుతో రికార్డింగు డ్యాన్సులు చేయించారంటూ నిర్వాహకులతోపాటు.. డ్యాన్సులు చేసిన అమ్మాయిలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇవి కూడా చదవండి.. ఆ యువకుడి ఆదాయం రోజుకు 9 లక్షలు… ఆ డబ్బుతో లగ్జరీ కార్లు, ఖరీదైన బైకులు కిడ్నాప్ కేసులో కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. మాజీ మంత్రి అఖిలప్రియ చెప్పిన వివరాలే కీలకం? కాబూల్ లో దారుణం.. సుప్రీంకోర్టు మహిళా జడ్జీలపై కాల్పులు