తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌లో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ 155/6

క్రైస్ట్‌‌‌‌‌‌‌‌చర్చ్‌‌‌‌‌‌‌‌ : ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌లో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో తడబడింది. క్రిస్‌‌‌‌‌‌‌‌ వోక్స్‌‌‌‌‌‌‌‌ (3/39), బ్రైడన్‌‌‌‌‌‌‌‌ కార్సీ (3/22) బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో చెలరేగడంతో.. శనివారం మూడో రోజు ఆట ముగిసే టైమ్‌‌‌‌‌‌‌‌కు కివీస్‌‌‌‌‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 49 ఓవర్లలో 155/6 స్కోరు చేసింది. డారిల్‌‌‌‌‌‌‌‌ మిచెల్‌‌‌‌‌‌‌‌ (31 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌), నేథన్‌‌‌‌‌‌‌‌ స్మిత్‌‌‌‌‌‌‌‌ (1 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. కేన్‌‌‌‌‌‌‌‌ విలియమ్సన్‌‌‌‌‌‌‌‌ (61) హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో టెస్ట్‌‌‌‌‌‌‌‌ల్లో 9 వేల రన్స్‌‌‌‌‌‌‌‌ మైలురాయిని అందుకున్నాడు. 

రచిన్‌‌‌‌‌‌‌‌ రవీంద్ర (24), గ్లెన్‌‌‌‌‌‌‌‌ ఫిలిప్స్‌‌‌‌‌‌‌‌ (19), టామ్‌‌‌‌‌‌‌‌ లాథమ్‌‌‌‌‌‌‌‌ (1), డేవన్‌‌‌‌‌‌‌‌ కాన్వే (8) నిరాశపర్చారు. ప్రస్తుతం కివీస్‌‌‌‌‌‌‌‌ 4 రన్స్‌‌‌‌‌‌‌‌ లీడ్‌‌‌‌‌‌‌‌లో ఉంది. అంతకుముందు 319/5 ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 103 ఓవర్లలో 499 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్‌‌‌‌‌‌‌‌ (171) భారీ సెంచరీ చేయగా, ఒలీ పోప్‌‌‌‌‌‌‌‌ (77), బెన్‌‌‌‌‌‌‌‌ స్టోక్స్‌‌‌‌‌‌‌‌ (80), అట్కిన్సన్‌‌‌‌‌‌‌‌ (48), బ్రైడన్‌‌‌‌‌‌‌‌ కార్సీ (33) రాణించారు. హెన్రీ 4, నేథన్‌‌‌‌‌‌‌‌ స్మిత్‌‌‌‌‌‌‌‌ 3, సౌథీ 2 వికెట్లు తీశారు.