Good Health : పచ్చి బఠానీ ఎంత ఆరోగ్యమో తెలుసా.. బరువు తగ్గుతారు.. రక్తం పెరుగుతుంది.. ఎముకలు ఇలా..!

పచ్చి బఠానీ చాలామంది ఇష్టంగా తింటారు. కూరగా యలతో కలిపి పలు వంటల్లో వండుతారు. ఎక్కువగా వెజ్, నాన్వెజ్ బిర్యానీలలో వేస్తారు. అలాగే పన్నీరు కర్రీ, ఆలు కుర్మాలో వేస్తారు. పచ్చి బఠానీ తినడం వల్ల అనేక ఉపయోగా లున్నాయి, కంటి సమస్యలను నివారించవచ్చు, రక్తహీనత ఉన్నవాళ్లు ఇవి తింటే రక్తం పెరుగుతుంది, ఎముకలు, దంతాలు మరింత బలంగా తయారవుతాయి. ఇవి తింటే పి ల్లల్లో ఎదుగుదల బాగుంటుంది, జీర్ణవ్యవస్థను మెరుగు పరు స్తుంది, అలాగని ఎక్కువ తింటే ఎసిడిటీ వచ్చే ప్రమాదం ఉంది.

చాలా రోగాలు దరికి రావు. విటమిన్ ఎ, బి1, బి2 సి, ఐరన్, కాల్షియం, పాస్పరస్ వీటిలో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి. వీటిని తింటే శరీరానికి కావాల్సి సంత శక్తి లభిస్తుంది. వెంటనే ఆకలి కూడా వేయదు. వీటిని తిన్న తర్వాత మిగిలిన పదా ర్థాలు తక్కువ తీసుకుంటారు.

ALSO READ : Good Health : షుగర్ ఉన్న వారు తీసుకోవాల్సిన చిరు ధాన్యాలు ఇవే.. వీటిని తింటే ఆరోగ్యంతోపాటు బలం కూడా..!

తక్కువ క్యాలరీలు అందుతాయి కాబట్టి, బరువు పెరిగే ప్రమాదం రాదు. వీటిని తినడం వల్ల ఫైబర్ కూడా లభిస్తుంది. కాబట్టి రోజూ తినే ఆహారంలో పచ్చి బఠానీ లేకపోయినా వారానికి ఒక సారైనా వీటిని సూప్ గా అయినా తీసుకుంటే అన్ని విధాలా మంచిది.

== V6 వెలుగు లైఫ్