ఇంటి వద్దకే నర్సింగ్, ఫిజియో థెరపీ సేవలు

ఇంటి వద్దకే నర్సింగ్, ఫిజియో థెరపీ సేవలు

మొబైల్‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌ నుంచే బుక్‌‌‌‌‌‌‌‌ చేసుకోవచ్చు
రూ.50 కోట్లు వెచ్చించిన హెల్త్‌‌‌‌‌‌‌‌ ఆన్‌‌‌‌‌‌‌‌ అజ్‌‌‌‌‌‌‌‌
పవన్​  చేతుల మీదుగా​ యాప్​ లాంచ్​

 
హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:
  నర్సింగ్‌‌‌‌‌‌‌‌, - ఫిజియో థెరపీ సేవలను అందుబాటులో ధరల్లో కస్టమర్లు తమ ఇంటితోపాటు, తమ ట్రాన్సిషన్‌‌‌‌‌‌‌‌ కేర్‌‌‌‌‌‌‌‌ సెంటర్లలో పొందేందవచ్చని హెల్త్‌‌‌‌‌‌‌‌ ఆన్‌‌‌‌‌‌‌‌ అజ్‌‌‌‌‌‌‌‌ తెలిపింది. ఇందుకోసం తయారు చేసిన మొబైల్‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌ను నటుడు పవన్​కల్యాణ్​హైదరాబాద్​లో ఆదివారం లాంచ్​ చేశారు. సంస్థ  చైర్మన్‌‌‌‌‌‌‌‌ లింగమనేని రమేశ్‌‌‌‌‌‌‌‌ విలేకరులతో మాట్లాడుతూ వ్యాధి బాధితులు, గాయాలైన వాళ్లు, ఆపరేషన్ ​తరువాత కోలుకుంటున్న వారికి ఈ యాప్​ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. పలు నగరాల్లో శాటిలైట్‌‌‌‌‌‌‌‌ కేంద్రాలను కూడా  నెలకొల్పామని చెప్పారు.

మొబైల్‌‌‌‌‌‌‌‌లో బుక్‌‌‌‌‌‌‌‌ చేయగానే ఇంటికి వెళ్లి, నర్సింగ్‌‌‌‌‌‌‌‌ సేవలను అందించేందుకు నర్సింగ్, ఫిజియోథెరపీ, ఫార్మసీ డెలివరీ సిబ్బంది అందుబాటులో ఉంటారు.  ‘హెల్త్‌‌‌‌‌‌‌‌ ఆన్‌‌‌‌‌‌‌‌ అజ్‌‌‌‌‌‌‌‌’ కేంద్రాల్లో ఎమర్జన్సీ కేర్‌‌‌‌‌‌‌‌లో సుశిక్షుతులైన, ఇంటర్వెన్షనల్‌‌‌‌‌‌‌‌ స్పెషలిస్ట్, అత్యవసరాల్లో వెంటిలేటర్‌‌‌‌‌‌‌‌తో చికిత్స అందించేలా పడకలు, అత్యవసర చికిత్సా గదులు (ఐసీయూ) ఉంటాయి”అని ఆయన అన్నారు. రాబోయే ఆరు నెలల్లో మరో 2-3 కేంద్రాలు నెలకొల్పుతామని అన్నారు. ఇప్పటికే రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టామని, రాబోయే మూడేళ్లలో విస్తరణ పథకాలకు మరో రూ.150–-175 కోట్ల పెట్టుబడి అవసరమని రమేశ్​ వివరించారు.   హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌ ఐసీయూతో పోలిస్తే చాలా తక్కువగా, రోజుకు రూ.7500–-10 వేలకే ట్రీట్​మెంట్​ అందిస్తామని వెల్లడించారు.