నాంపల్లిలో నుమాయిష్​లో సండే రష్

బషీర్ బాగ్, వెలుగు : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో నుమాయిష్ సందడిగా కొనసాగుతున్నది. ఆదివారం సెలవు దినం కావడంతో స్టాళ్లన్నీ సందర్శకులతో కిటకిటలాడాయి. మొదటి రోజు 4,570 మంది,  రెండో రోజు 19,549 మంది, మూడోరోజైన ఆదివారం ఏకంగా 30,540 మంది సందర్శకులు తరలివచ్చారని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు నిరంజన్ తెలిపారు. 

నుమాయిష్​లో ఇప్పటికే 80 శాతం స్టాళ్ల ఏర్పాటు పూర్తయిందని , మరో మూడు రోజుల్లో మిగిలిన స్టాల్స్ ఏర్పాటు అవుతాయన్నారు.