నీట్  నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలి : వెంకట్

అయిజ, వెలుగు : నీట్ నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు వెంకట్  డిమాండ్  చేశారు. సోమవారం పట్టణంలోని కొత్త బస్టాండ్  సెంటర్ లో విద్యార్థి సంఘం నేతలతో కలిసి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ పరీక్ష నిర్వహణను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.

నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందన్నారు. నీట్ తో పాటు ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్  చేశారు. ప్రకాశ్​యోనా, నవాజ్, రమేశ్, రాజు పాల్గొన్నారు.