భారత్ లోనూ కనిపించిన మిస్టీరియస్ మోనోలిత్

భారత్ లోనూ కనిపించిన మిస్టీరియస్ మోనోలిత్
భారత్ లోనూ మిస్టీరియస్ మోనోలిత్ కనిపించింది. అహ్మదాబాద్ లోని ఓ పార్క్ లో ఆరు అడుగుల పొడవున్న మోనోలిత్ ప్రత్యక్షమైంది. కొన్నిరోజులు కనిపిస్తూ తర్వాత కనిపించకుండా పోతున్న ఈ మోనోలిత్ గురించి ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ జరుగుతోంది. అహ్మదాబాద్ లోని పార్క్ లో భూమిలో పాతిపెట్టినట్టు ఉన్నప్పటికీ మట్టిని తవ్వినట్టు కనిపించడంలేదు. ఆ మోనోలిత్ ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియడంలేదంటున్నారు ఆ పార్క్ గార్డెనర్. ఆ మోనోలిత్ పై రకరకాల రాతలు, గుర్తులు ఉన్నాయి. లోకల్ యూత్ మోనోలిత్ తో ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు.