Theater Release Movies: ఈ వారం (Nov28) థియేటర్లో రిలీజయ్యే సినిమాలు ఇవే

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం హిందీ, ఇంగ్లీష్..ఇలా భాషతో సంబంధం లేకుండా ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అందులో కొన్ని ప్రేక్షకులను అలరిస్తే మరికొన్ని నిరాశపరుస్తాయి. ఇక ఈ వారం( Nov28) కూడా థియేటర్ కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటనేవి చూద్దాం.

Also Read:-రాజాసాబ్ సౌండ్ స్టార్ట్.. ప్రభాస్, మాళవికల డ్యూయెట్ సాంగ్.. ఎక్కడంటే?

'మిస్‌ యూ’ (Miss You):

హీరో సిద్దార్థ్ యంగ్ హీరోయిన్ ఆశికా రంగనాథ్ కలిసి నటించిన  మూవీ 'మిస్‌ యూ’ (Miss You). క్లాసికల్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాను తమిళ్ డైరెక్టర్ ఎన్. రాజశేఖర్ రూపొందించాడు. మిస్ యూ సినిమా గురువారం (నవంబర్ 28న) వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచాయి.

రోటి కపడా రొమాన్స్ (Roti Kapada Romance):

హర్ష నర్రా, మేఘలేఖ జంటగా  సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, ఖుష్బూ చౌదరి ముఖ్య పాత్రల్లో విక్రమ్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం నిర్మాతలు. న‌‌లుగురు స్నేహితుల క‌‌థ ఇది. యూత్‌‌ఫుల్ ఎంట‌‌ర్‌‌టైన‌‌ర్‌‌ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ మూవీ నవంబరు 28న రిలీజ్ కానుంది.

భైరతి రణగల్‌ (Bhairathi Ranagal):

క‌న్న‌డ చక్రవర్తి స్టార్ హీరో శివరాజ్‌ కుమార్ హీరో న‌టిస్తున్నలేటెస్ట్ మూవీ భైరతి రణగల్‌ (Bhairathi Ranagal). ఈ సినిమాకు నర్తన్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండ‌గా.. స‌ప్త సాగ‌రాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ శుక్రవారం (నవంబరు 29న) రిలీజ్ కానుంది.