డిసెంబ‌ర్ లో విడుద‌ల కానున్న క‌రోనా వ్యాక్సిన్..?

డిసెంబ‌ర్ లో విడుద‌ల కానున్న క‌రోనా వ్యాక్సిన్..?

క‌రోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన నోవావాక్స్ సంస్థ కీలక ప్రకటన చేసింది. తాము త‌యారు చేస్తున్న వ్యాక్సిన్ ను విడుద‌ల చేసేలా ఆమోదం పొందేందుకు డిసెంబ‌ర్ నెల‌లో అప్ల‌య్ చేస్తామ‌ని ఆ సంస్థ సీఈఓ స్టాన్లీ ఎర్క్ తెలిపారు.

మీడియా తో మాట్లాడుతూ వ్యాక్సిన్‌లో కొంత భాగాన్ని తన సొంత సంస్థ‌కు చెందిన ఫ్లాంట్ నుంచే ఉత్ప‌త్తి చేయాల‌ని కంపెనీ యోచిస్తున్న‌ట్లు తెలిపారు. వ్యాక్సిన్ విడుద‌ల ఆమోదం త‌రువాత ఉత్ప‌త్తి చేస్తామ‌న్నారు.

నోవావాక్స్ త‌యారు చేసిన క‌రోనా వ్యాక్సిన్ రెండో ద‌శ‌ హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్ చేసేందుకు వాలంటీర్ల‌ను సెల‌క్ట్ చేసుకుంటున్న‌ట్లు నోవావాక్స్ సీఈఓ స్టాన్లీ
వెల్ల‌డించారు.