మెకాన్ లిమిటెడ్లో ఇంజినీరింగ్ పోస్టులు

రాంచీలోని మెకాన్ లిమిటెడ్ కాంట్రాక్ట్​ ప్రాతిపదికన ఇంజినీర్​ విభాగాల్లో ప్రొఫెషనల్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది. 

ఖాళీలు: మొత్తం 309 ఖాళీల్లో  డిప్యూటీ ఇంజినీర్: 87, ఇంజినీర్: 1, అసిస్టెంట్ ఇంజినీర్: 88, జూనియర్ ఇంజినీర్: 15, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్: 8, జూనియర్ ఎగ్జిక్యూటివ్: 4, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్: 10, ఎగ్జిక్యూటివ్: 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 
అర్హత: సంబంధిత విభాగంలో సీఎంఏ/ సీఏ/ డిప్లొమా/ డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 15 జూన్​-2024 నాటికి 50 ఏళ్లు మించకూడదు.
సెలెక్షన్​: విద్యార్హతలు, పని అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు:  అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో జులై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు www.meconlimited.co.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.