NTPC నోటిఫికేషన్ ఇంటర్‌తో రైల్వేలో 3,445 ఉద్యోగాలు

ప్రభుత్వ ఉద్యోగమనేది చాలామంది కల.. అయితే ఆ కలని నిజం చేసుకోవాలనే తపనతో గంటలు, గంటలు చదువుతూనే ఉంటారు. నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఎన్టీపీసీ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని రైల్వేజోన్లలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 

అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టుల కింద 3445 జాబ్స్ కు దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇంటర్ లేదా తత్సమాన విద్యా అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. సెప్టెంబరు 21న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 20 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.

ALSO READ | JNTUలో 9మంది‌ విద్యార్ధులకు జాక్‪పాట్ : కంపెనీ బంఫర్ ఆఫర్

దరఖాస్తు గడువు అక్టోబరు 20 ముగిసిన తర్వాత అక్టోబరు 21, 22 తేదీల్లో పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పరీక్ష ఫీజు కింద రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు, ట్రాన్స్‌జెండర్, ఎక్స్-సర్వీస్‌మెన్, ఎస్సీ-ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు ఫీజు రూ.250 మాత్రమే. అక్టోబరు 23 నుంచి నవంబరు 1 వరకు అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ ఉంటోంది. 

ఎగ్జామ్ తేదీలను త్వరలో ప్రకటిస్తారు. రెండు దశల్లో రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపిక జరుగుతంది. పూర్తి వివరాలు, సిలబస్ కోసం అధికారిక వెబ్ సైట్ లో పొందుపరిచారు.