హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్.. పూర్తి వివరాలు ఇవే

బెంగళూరులోని హిందుస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏరోనాటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 24 స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది. 

ఖాళీలు:  మొత్తం 24 పోస్టుల్లో జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పెషలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 8, మిడిల్ స్పెషలిస్ట్: 12, సీఎంఎం (లెవల్-5) ఇంజినీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : 4 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. నెలకు సీఎంఎం పోస్టుకు రూ.60,000; మిడిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పెషలిస్ట్ పోస్టుకు రూ.50,000; జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టుకు రూ.40,000 చెల్లిస్తారు. 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిగ్రీ (మెకానికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ఎలక్ట్రికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ఎలక్ర్టానిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమ్యూనికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/కంప్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ఏరోనాటికల్/ కెమికల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  
 

అప్లికేషన్స్​: ఆన్​లైన్​లో నవంబర్​ 29 వరకు అప్లై చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులు రూ.500 అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి. రిజర్వేషన్​ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. వివరాలకు www.hal-india.co.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.