గుడ్ న్యూస్: 633 ఫార్మాసిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-2 పోస్టులకు నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్రంలో 633 ఫార్మాసిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-2 పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు (ఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ) నోటిఫికేషన్​ విడుదల చేసింది.

ఖాళీలు: మొత్తం 633 పోస్టుల్లో  డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్/ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ 

ఎడ్యుకేషన్: 445 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్: 185 పోస్టులు, ఎంఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జే ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీజినల్ క్యాన్సర్ సెంటర్: 2 పోస్టులు ఉన్నాయి. 

అర్హత: డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఫార్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీ ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకొని ఉండాలి. వయసు 18 నుంచి  46 సంవత్సరాల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.31,040- రూ.92,050 చెల్లిస్తారు.

సెలెక్షన్​ ప్రాసెస్​: రాత పరీక్షకు 80 మార్కులు, మిగిలినవి వెయిటేజీ కింద కలుపుతారు. అభ్యర్థులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒప్పంద, అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోర్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాతిపదికన పనిచేసిన వారికి వెయిటేజీ కింద 20 పాయింట్లు కేటాయిస్తారు.

అప్లికేషన్స్​: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో అక్టోబర్​ 5 నుంచి అక్టోబర్​ 21 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్​ ఫీజు రూ.500 చెల్లించాలి. రాత పరీక్ష నవంబర్​ 30న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు www.mhsrb.telangana.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.