న్యూఢిల్లీ : గత పదేండ్లలో ఢిల్లీలో మహిళ లపై నేరాలు మరింత పెరిగాయని ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ అన్నారు. గడిచిన దశాబ్దంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు తగ్గలేదన్నారు. నిర్భయ ఘటన జరిగి శనివారానికి 11 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో స్వాతి మలివాల్ మాట్లా డుతూ.. 2012లో నిర్భయపై గ్యాంగ్ రేప్ జరిగిందని ఆమె గుర్తుచేశారు. ఇన్నేండ్ల తర్వాత కూడా ఢిల్లీలో పరిస్థితి మారలేద ని మలివాల్ ఆవేదన వ్యక్తంచేశారు. తప్పు చేస్తే వ్యవస్థ విడిచిపెట్టదనే భయం నేరస్తు లకు కలిగే వరకు ఏమీ మారదన్నారు. ఈ కేసులను ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణిం చాలని విజ్ఞప్తి చేశారు. పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల సంఖ్యను పెంచాలని స్వాతి మలివాల్ సూచించారు.
