భారత సైనికులను ఎవరూ అడ్డుకోలేరు

భారత సైనికులను ఎవరూ అడ్డుకోలేరు
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి ఉన్న ఎయిర్ బేసెస్‌‌ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జనరల్ బిపిన్ రావత్ విజిట్ చేశారు. అక్కడి ఫ్రంట్‌‌లైన్ సోల్జర్స్‌‌ను రావత్ కలిశారు. అలాగే ఆర్మీ అధికారులు, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు, స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్‌‌తోనూ ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రావత్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో భారత సాయుధ దళాలను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. చైనాతో బార్డర్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో రావత్ ఎల్‌‌ఏసీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకొంది. ఉద్రికత్తల తగ్గింపునకు భారత్-చైనా మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ అవి ఫలప్రదం కాలేదు.