ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. నెల్లూరులో జరిగిన నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యపై చంద్రబాబు స్పందించారు. ఆర్టీసీ కార్మికులు సురేందర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డిలు మనస్తాపంలో ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఇద్దరి ఆత్మహత్య తనను కలిచి వేసిందన్నారు. కార్మికులెవరూ సంయమనం కోల్పోవద్దని, ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

