ఉత్తర కొరియా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రీస్కూల్ విద్యార్ధులు దేశంలో గొప్పనాయకుల గురించి తెలుసుకునే సమయాన్ని మూడురెట్లు పెంచినట్లు సమాచారం.
ఓ నివేదిక ప్రకారం..ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్,ఆయన సోదరి కిమ్ యోజోంగ్ ఇటీవల దేశంలో ఉన్న ప్రీస్కూల్స్ లో పాఠాలు చెప్పే విధానాన్ని సవరించారు.
ఆగస్ట్ 25 నుంచి ప్రీస్కూల్స్ లో సవరించిన మార్పులకు అనుగుణంగా టీచర్స్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ క్లాసుల్లో 90నిమిషాల పాటు ఆదేశ నాయకుల గొప్పతనాన్ని పొగుడుతున్నారు.
గ్రేట్ నెస్ ఎడ్యుకేషన్ పేరుతో గతంలో నాయకుల గురించి తెలుసుకునే సమయం 30నిమిషాలు ఉండగా ఇప్పుడు ఆసమయం 90నిమిషాలు చేసింది ఉత్తర కొరియా ప్రభుత్వం.
ఈ 90నిమిషాలు నాయకుల గురించి తెలుసుకోవడం వల్ల ఉత్తర కొరియా పిల్లలలో దేశ నాయకత్వం పట్ల విధేయత మరియు నమ్మకాన్ని పెంచేలా ఉందంటూ దక్షిణ కొరియాకు చెందిన డైలీ ఎన్కె నివేదించింది
ఐదు మరియు ఆరు సంవత్సరాల వయస్సు గల పిల్లలు కిమ్ ఇల్-సుంగ్ (కిమ్ తాత ) మరియు కిమ్ జోంగ్-ఇల్ (కిమ్ తండ్రి ), కిమ్ జోంగ్ ఉన్ గురించి వారి విప్లవాలు, నాయకత్వం గురించి 90 నేర్పిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ అంశంపై ఉత్తర కొరియాకు చెందిన ప్రీస్కూల్స్ విద్యార్ధుల తల్లిదండ్రులు డైలమాలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తున్నాయి.
