తెలుగు రాష్ట్రాల్లో రెండు, మూడు రోజుల నుండి ఎండలు దంచికొడుతున్నాయి. మొన్నటి దాకా అక్కడక్కడా కురిసిన వర్షాలతో వాతావరణం కాస్త చల్లబడినప్పటికీ మళ్ళీ వడగాల్పులు ఎక్కువైన నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వాతావరణశాఖ తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు చెప్పింది.తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాల వచేస్తున్నాయని తెలిపింది. ఇవాళ ఏపీలో ప్రవేశిస్తాయని, జూన్ 10న తెలంగాణాలో ప్రవేశిస్తాయని తెలిపింది వాతావరణ శాఖ.
ఏపీలో మొదట రాయలసీమలో రుతుపవనాల ప్రభావం కనిపిస్తుందని, ఆ తర్వాత రాష్ట్రమంతా విస్తరిస్తామని తెలిపింది. తెలంగాణలో జూన్ 10న ప్రవేశించి రాష్ట్రమంతా విస్తరిస్తామని తెలిపింది వాతావరణ శాఖ.జూన్ 2నుండి ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, అప్పటిదాకా వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది. దక్షిణ కోస్తాలో వడగాలులు కొనసాగుతాయని, అక్కడక్కడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.