న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి కారణంగా అమలవుతున్న ట్రావెల్ రెస్ట్రిక్షన్స్‌ను పూర్తి స్థాయిలో ఎత్తేసేందుకు కేంద్రం రెడీ అవుతోంది. ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసులు త్వరలోనే సాధారణ స్థితికి చేరుకుంటాయని సివిల్ ఏవియేషన్ సెక్రెటరీ రాజీవ్ బన్సాల్ తెలిపారు. అంతర్జాతీయ విమాన సర్వీసులపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విధించిన సస్పెన్షన్ నవంబర్ 30తో ముగుస్తోంది. తరువాత అన్ని ఇంటర్నేషనల్ సర్వీసులు మామూలుగానే తిరుగుతాయని తెలుస్తోంది. ఇక, ఈ ఏడాది డిసెంబర్ చివరికి ఎయిర్ ఇండియా ఆపరేషన్స్‌ను టాటా గ్రూప్‌కు అప్పగించనున్నట్టు బన్సాల్ వెల్లడించారు. వచ్చే ఐదేండ్లలో దేశంలోని ఎయిర్‌పోర్ట్ సెక్టార్‌లో రూ.90 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నామన్నారు.
