రేపటి నుంచి మళ్లీ పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు

రేపటి నుంచి మళ్లీ పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు

రేపటి నుంచి నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ధరణి వివాదం కావడంతో తెలంగాణ హైకోర్ట్ విచారణ చేపట్టింది. సర్వేలో అనవసర వివరాలు తీసుకోవడంతో పాటు డేటా సెక్యూరిటీపై అనుమానాలున్నాయని కోర్టు స్టే విధించింది. దీనివల్లే రిజిస్ట్రేషన్లు ఆగాయని సర్కారు చెప్పింది. అయితే రిజిస్ట్రేషన్లపై స్టే ఇవ్వలేదనీ, పాత విధానంలో చెసుకోవచ్చని కోర్టు చెప్పింది.

మరోవైపు రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక తప్పని పరిస్థితుల్లో పాత విధానంలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ రేపటి నుంచి నాన్ అగ్రికల్చర్ ఆస్తులు పాతపద్ధతిలోనే రిజిస్ట్రేషన్లను ప్రారంభిస్తున్నట్లు ట్వీట్ చేశారు.