ICC Award: ఆ ఇద్దరికీ నిరాశే.. పాకిస్థాన్ ప్లేయర్‌ను వరించిన ఐసీసీ అవార్డు

పాకిస్థాన్ స్పిన్నర్ నోమన్ అలీకి ఐసీసీ అవార్డు లభించింది. ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఈ పాక్ స్పిన్నర్ అసాధారణ ప్రదర్శన చేశాడు. అక్టోబర్ నెలలో అద్భుత ప్రదర్శన కనబర్చిన నోమన్ మంగళవారం (నవంబర్ 12) మెన్స్ పురుషుల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్నాడు. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబడా, న్యూజిలాండ్ ఆల్ రౌండర్ సాంట్నర్ ఈ అవార్డుకు నామినేట్ అయినా నిరాశ తప్పలేదు. 

అక్టోబరులో పాకిస్థాన్ ఇంగ్లాండ్ తో మూడు టెస్టుల సిరీస్ ఆడింది. తొలి టెస్టులో స్థానం దక్కించుకొని నోమన్ అలీ చివరి రెండు టెస్టుల్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రెండు టెస్టుల్లో ఏకంగా 20 వికెట్లు తీశాడు. రెండో టెస్టులో 11 వికెట్లు పడగొట్టిన అతను.. చివరిదైన మూడో టెస్టులో 9 వికెట్లతో సత్తా చాటాడు. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. నోమన్ అలీ సూపర్ బౌలింగ్ తో పాకిస్థాన్ టెస్ట్ సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకుంది. 

ALSO READ | AFG vs BAN: 22 ఏళ్లకే సంచలనం.. సచిన్, కోహ్లీని వెనక్కి నెట్టిన ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్

"ఐసిసి మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంగ్లండ్‌పై స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో పాకిస్తాన్ గెలవడానికి అత్యుత్తమ ప్రదర్శనను అందించడంలో నాకు సహాయం చేసిన నా సహచరులందరికీ చాలా కృతజ్ఞతలు". అని ఈ అవార్డు గెలుచుకున్న తర్వాత నోమన్ అలీ అన్నాడు. మహిళా విభాగంలో న్యూజిలాండ్ ఆల్ రౌండర్ మెలీ కెర్ అక్టోబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును కైవసం చేసుకుంది.